Telangana High Court on TSPSC Group 1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయింది. జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్‌సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం.. హాల్‌ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్ లీక్ కారణంగా గతంలోనూ గ్రూప్-1 రద్దవ్వగా.. తాజాగా రెండోసారి రద్దు అయింది. మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. 994 ఎగ్జామ్ సెంటర్స్‌లో పరీక్షలు నిర్వహించగా.. 2,32,457 మంది హాజరయ్యారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో మొదటి సారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దవ్వగా.. తాజాగా బయోమెట్రిక్ వివరాలు, హాల్ టికెట్ నంబరు లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇవ్వడంతో హైకోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన గ్రూప్‌ 1 పరీక్షను  మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలంటూ ఇంతకు ముందు పలువురు అభ్యర్థులు  హైకోర్టులో  పిటిషన్‌లు వేసిన విషయం తెలిసిందే. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు..  తాజాగా  పరీక్ష రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లనున్నట్లు సమాచారం.


గతేడాది అక్టోబర్ నెలో తొలిసారిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. అనంతరం ఫలితాలు విడుదలవ్వగా.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్లు మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న తరుణంలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో టీఎస్‌సీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు పలు పరీక్షలను రద్దు చేసింది. మరోసారి జూన్ 11న నిర్వహంచిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. ప్రాథమిక కీను విడుదల చేశారు. తాజాగా పరీక్ష రద్దు కావడంలో అభ్యర్థులు ఆందోళనలో పడిపోయారు.


Also Read: KL Rahul Poor Keeping: కేఎల్ రాహుల్ చెత్త కీపింగ్‌తో భారత్‌కు లాభం.. రెండు వికెట్లు సమర్పించుకున్న ఆసీస్


Also Read: PRSI National Awards: ఐటీ శాఖ తెలంగాణ డిజిటల్ మీడియా విభాగానికి అవార్డుల పంట 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి