Telagana: హైదరాబాద్ మేయర్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కరోనా సెగ పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సోకిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ మేయర్ ను పట్టుకుంది. రెండుసార్లు నెగెటివ్ గా వచ్చినా...ఇప్పుడు మూడోసారి మాత్రం పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు కరోనా సెగ పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు సోకిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ మేయర్ ను పట్టుకుంది. రెండుసార్లు నెగెటివ్ గా వచ్చినా...ఇప్పుడు మూడోసారి మాత్రం పాజిటివ్‌గా తేలింది.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కోవిడ్ 19 వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రావుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కుటుంబసభ్యులతో సహా చేయించుకున్న యాంటీజెన్ పరీక్షల్లో మేయర్ రామ్మోహన్ రావుకు పాజిటివ్ రాగా...కుటుంబసభ్యులకు మాత్రం నెగెటివ్‌గా తేలింది. మేయర్ కు కరోనా పాజిటివ్ గా వచ్చినా...లక్షణాలు మాత్రం ఏం లేవని తెలిసింది. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఐసోలేషన్‌లో ఉండి కూడా జీహెచ్‌ఎంసీకు సంబంధించిన వివిధ పనుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు.
గతంలో మేయర్ రామ్మోహన్ రావు రెెండుసార్లు కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ గా వచ్చింది. మూడోసారి మాత్రం పాజిటివ్‌గా ధృవీకరణైంది. Also read:COVID19 Medicine: ‘రెమ్‌డెసివర్’ అక్కడ మాత్రమే విక్రయాలు