Telangana IAS Officers: తెలుగు రాష్ట్రాల మధ్య ఐఏఎస్‌ అధికారుల వివాదం నడుస్తోంది. తమ కేడర్‌ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులు వెళ్లడం లేదు. వెంటనే ఏపీకి తిరిగి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించినా కూడా వారు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏపీకి వెళ్లాలని చెప్పిన అధికారులంతా వెనుకంజ వేస్తున్నారు. ఈక్రమంలోనే మరోసారి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణలోనే కొనసాగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పరిణామంతో ఆసక్తికర చర్చ మొదలైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు హైఅలర్ట్.. మరో 'విజయవాడ' కావొద్దని వార్నింగ్


 


ఈనెల 16వ తేదీలోపు మీకు కేటాయించిన ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లాలని ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజనను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సమయం దగ్గర పడుతున్నా కూడా ఐఏఎస్‌ అధికారులు మాత్రం చేరేందుకు సిద్ధంగా లేరు. గడువు ముగుస్తున్నా కూడా వారు ఏపీకి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. ఈ క్రమంలోనే కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్‌ (క్యాట్)ను మరోసారి ఆ నలుగురు ఐఏఎస్‌ అధికారులు ఆశ్రయించారు.

Also Read: Liquor Price: చంద్రబాబు సర్కార్‌ శుభవార్త.. ఏ మందు సీసా ఎంత ధర తెలుసా?


 


క్యాట్‌లో సోమవారం వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన పిటిషన్‌ దాఖలు చేశారు. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు కోరారు. ఇక ఏపీలో విధులు నిర్వహిస్తున్న సృజన కూడా తనను ఏపీలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలా ఈ నలుగురు ఐఏఎస్‌ అధికారులు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.


సీఎస్‌తో మంతనాలు
కాగా పిటిషన్‌ దాఖలు చేసే ముందు హైదరాబాద్‌లోని సచివాలయంలో ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో చర్చించారు. ఆమె ఆదేశాల మేరకు వారు క్యాట్‌లో పిటిషన్‌ వేశారని తెలుస్తోంది. పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ అధికారులు ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కాలేదు. ఏపీకి వెళ్లేందుకు నిరాకరిస్తూనే తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ఐఏఎస్‌ అధికారులు బిజీగా ఉన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి