Chandrababu High Alert: ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ భారీ వర్షం ముప్పు ఏర్పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొన్ని వారాల కిందట విజయవాడ వరదలను ఇంకా మరచిపోలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉండడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజలకు భరోసా కల్పిస్తూనే అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై హైఅలర్ట్ ప్రకటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Telugu Desam Janasena : జనసేనలో చేరికలతో టీడీపీలో కొత్త టెన్షన్
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ చేపట్టి సమీక్షించారు. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సమీక్ష చేశారు. విజయవాడ వరదలను చూసి మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
Also Read: Liquor Price: చంద్రబాబు సర్కార్ శుభవార్త.. ఏ మందు సీసా ఎంత ధర తెలుసా?
'రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 ఎంఎం సరాసరి వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదైంది' అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజులు పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపిందని.. జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలి...పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.
అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై సందేశాలు పంపి అలెర్ట్ చేయాలని సూచించారు. చెరువు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టిపెట్టాలన్నారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షపాతం వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలన్నారు.
అప్రమత్తతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు తెలిపారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter