Telangana IT Minister KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీలో ఎంత గౌరవం ఇచ్చామో గుర్తుకు చేసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ నేత ఈటల రాజేందర్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈటల, బండి సంజయ్ భేటీ కానున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మంత్రి కేటీఆర్ (Telangana IT Minister KTR) హైదరాబాద్‌లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్‌కు ఎంత విలువ, గౌరవం ఇచ్చామో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రివర్గం నిర్ణయాలను తప్పుపట్టడం సరైన పద్దతి కాదన్నారు. మంత్రిగా ఉంటూ కేబినెట్ నిర్ణయాలను తప్పుపడుతూ తన తప్పులను తానే ఒప్పుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.


Also Read: Etela Rajender Delhi Tour: బీజేపీ నేతగా తొలిసారి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ!


ఈటల రాజేందర్ తనకు తోచిన విషయాలు మాట్లాడినా, ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని గుర్తుచేశారు. ఒకవేళ గతంలోనే తన ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ మంత్రి పదవిలో ఎలా కొనసాగారని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) టీఆర్ఎస్ పార్టీలో ఉండటానికి తాను ప్రయత్నించానని, కానీ ఆయన పార్టీ నుంచి ఎందుకు వైదొలిగారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వ్యక్తుల మధ్య పోటీ ఉండదని, కేవలం పార్టీల మధ్యే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.


Also Read: Komati Reddy Rajgopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook