Krishna Reddy appointed TSPSC acting chairman: హైద‌రాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( TSPSC ) తాత్కా‌లిక చైర్మ‌న్‌గా డీ. కృష్ణా‌రె‌డ్డిని నియ‌మితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురు‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయిలో కొత్త చైర్మన్ నియామకం వరకు.. ఇప్ప‌టి‌వ‌రకు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కమి‌షన్‌ సభ్యు‌డిగా ఉన్న డీ. కృష్ణా‌రె‌డ్డి (Krishna Reddy) యాక్టింగ్ చైర్మన్‌గా పదవిలో కొనసాగుతారని తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్ర‌పాణి, సభ్యులు సీ విఠల్‌, మహ్మద్‌ ఎం ఖాద్రీ, బానోత్ చంద్రా‌వ‌తి పదవీకాలం గురువారంతో ముగిసింది. చైర్మన్, ముగ్గురు సభ్యుల పదవీ విర‌మణ అనంతరం కమిషన్‌లో ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలారు. వారిలో డీ. కృష్ణా‌రె‌డ్డి, చింతా సాయిలు ఉన్నారు. ఇందులో సినీయర్ అయిన డీ. కృష్ణా‌రె‌డ్డికి ప్రభుత్వం (Telangana government) తాత్కలిక చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. Also read: Coronavirus: తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు, రికవరీలో భేష్!


చైర్మన్, ముగ్గురు సభ్యుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గురు‌వారం సాయంత్రం హైదరాబాద్ నాంపల్లి‌లోని ప్రతిభా భవ‌న్‌లో వీడ్కోలు కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హించారు.  




Also read: Mouni Roy: చురకత్తుల్లాంటి చూపులతో చంపేస్తున్న మౌనీ రాయ్


Also read: Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook