Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరా హోరీ.. చెరి సగం సీట్లలో పాగా..
Telangana Lok Sabha Elections 2024: దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల ప్రజుల పెద్ద షాక్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటివి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అంతో ఇంతో చెప్పుకోదగ్గ పరిణామం.
Telangana Lok Sabha Elections 2024: గత రెండు పర్యాయాలు పనిచేసిన మోదీ మేనియా ఈ సారి పనిచేయలేదనే చెప్పాలి. అబ్ కీ పార్ 400 పార్ అన్న భారతీయ జనతా పార్టీ నినాదం ఈ సారి ఎన్నికల్లో కొంప ముంచిందనే చెప్పాలి. మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోవడం ఖాయమే. కానీ ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందే. గతంలో మాదిరి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువు తీరనుంది.
మొత్తంగా బీజేపీ ఎన్టీయే కూటమితో కలిపి 300 సీట్లకు అటు ఇటుగా ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో బీజేపీ పర్ఫామ్ ఈసారి బాగుంది. మొత్తంగా 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ 8 లోక్ సభ స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, చేవేళ్ల, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో బీజేపీ జయ కేతనం ఎగరేసింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చెరో 8 స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది. తెలంగాణలోని పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో ఢంకా బజాయించింది. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాంలో ఆనవాయితీగా అసదుద్దీన్ ఓవైసీ ఐదోసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈయన ఇక్కడ బీజేపీ అభ్యర్ధి మాధవి లతపై మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బోణి కొట్టలేదు. ఆ పార్టీని ప్రజలు ఛీ కొట్టడం విశేషం. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పక్కలో బల్లెంలా మారిందనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook