AP Assembly and Lok Sabha Election Result 2024 Live Updates: దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. మంగళవారం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలుకానుంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైసీపీకి చెక్ పెడుతుందా..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా మిక్స్‌డ్ రిజల్ట్ రావడంతో గెలుపు ఎవరిదనే విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు. మద్యాహ్నం 12 గంటల సమయానికి ఏపీ ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా.. 3.33 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షలమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.