Minister Harish Rao: కేంద్రమంత్రి షెకావత్‌పై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రులది పూటకో మాట అని అన్నారు. పార్లమెంట్ ఓ మాట..ప్రజాక్షేత్రంలో మరో మాట చెబుతున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని కేంద్రమంత్రి షెకావత్ చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మళ్లీ ఇప్పుడు ఏ అనుమతులు లేవని..అవినీతి జరిగిందని షెకావత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్‌లో ఏ ఒక్క ఆపరేషన్‌, ఏ ఒక్క కాన్పు జరిగిందా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఎయిమ్స్‌ పక్కన ఉన్న తెలంగాణ పీహెచ్‌సీలో ఎన్నో కాన్పులు జరుగుతున్నాయో తెలుసుకోవాలన్నారు. ఉస్మానియా వైద్యులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. 
  
మోదీ ఉచితాలు వద్దని అంటున్నారని..మరి తెలంగాణ పథకాలను తొలగిస్తారా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. దీనిపై తెలంగాణ ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  మేడ్చల్‌లో పర్యటించిన ఆయన 50 పడకల ఎంసీహెచ్ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రిలో 8 మంది వైద్యులు, 16 మంది స్టాఫ్‌ నర్సులు, 50 సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 


టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నామని గుర్తు చేశారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఆచరణలో పెట్టామన్నారు. గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో 250 పడకల చొప్పున మాతా శిశు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఆస్పత్రుల గురించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దారుణంగా మాట్లాడటం సరికాదన్నారు. 


Also read:Hyderabad Police Towers: రేపే అందుబాటులోకి పోలీస్ టవర్స్.. కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు..!


Also read:Naga Chaitanya: నాగ చైతన్య, సమంత కలిసి నటించబోతున్నారా..చైతూ ఏమన్నాడంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook