Hyderabad Police Towers: రేపే అందుబాటులోకి పోలీస్ టవర్స్.. కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు..!

Hyderabad Police Towers: హైదరాబాద్‌లో రేపటి నుంచి పోలీస్ టవర్స్‌ అందుబాటులోకి రానుంది. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి.

Written by - Alla Swamy | Last Updated : Aug 3, 2022, 02:19 PM IST
  • అందుబాటులోకి పోలీస్ టవర్స్‌
  • రేపే ప్రారంభం
  • సీఎం కేసీఆర్ మీదుగా ఆరంభం
Hyderabad Police Towers: రేపే అందుబాటులోకి పోలీస్ టవర్స్.. కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు..!

Hyderabad Police Towers: బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయబోతున్నారు. కమాండ్ కంట్రోల్‌ రూమ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీస్ టవర్స్‌ను నిర్మించారు. 
 
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మొత్తం ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ Aలో ఇరవై అంతస్తులను నిర్మించారు. ఇందులోనే సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్‌ A పైభాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. టవర్‌ Bలో 15 అంతస్తులు ఉన్నాయి. ఇందులో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉండనుంది. టవర్‌ Cలో మూడు ఫ్లోర్‌లు ఉన్నాయి. ఇందులో ఆడిటోరియంగా పోలీసులు వినియోగించనున్నారు. 

టవర్‌ Dని మీడియా అండ్ ట్రైనింగ్ సెంటర్‌ కోసం ఉపయోగించనున్నారు. మొత్తం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టవర్ A, టవర్ B కీలకంగా ఉండనుంది. టవర్‌ Eలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్, సీసీ టీవీ మానిటరింగ్, వార్ రూమ్ ఉండనున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూచే వెసులుబాటు ఉంది. కమాండ్ కంట్రోల్‌ రూమ్‌లో ప్రత్యేక మ్యూజియం ఉండనుంది. పోలీస్ డిపార్టమెంట్‌ ఎలా పని చేస్తుందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. 

ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉన్నాయి. పోలీస్ టవర్స్ ప్రారంభం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో అత్యంత రద్దీ ఉండనుంది..వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ద్వారా వెళ్లే వాహనదారులంతా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ మీదుగా వెళ్లాలని తెలిపారు. 

Also read:AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!

Also read:Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ టెర్రర్..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News