Jagadish Reddy Corona Positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నానాటికి పెరుగుతున్న కొవిడ్ కేసులు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, జాతీయ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా.. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. కొవిడ్ టెస్ట్ చేయించుకోగా అందులో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.


అయితే తనకు కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తనను కలిసి వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. 


అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. భౌతిక దూరం పాటిస్తూ.. తరచూ శానిటైజర్​తో చేతులు శుభ్రపరుచుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.  


Also Read: Corona Third Wave: తెలంగాణలో సంక్రాంతి సెలవుల పొడిగింపుపై నిర్ణయం


Also Read: Telangana: కాకతీయ వైద్యకళాశాలలో కరోనా కల్లోలం..మరో 15 మంది విద్యార్థులకు పాజిటివ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook