Ask Ktr: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్‌ పోరాడుతోందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కన్నా గట్టిగా నిలదీస్తున్నామని చెప్పారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్‌లో నెటిజన్లతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయన్నారు. 2014లో 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వేయికిపైగా అయ్యిందని గుర్తు చేశారు. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ తగ్గించాలని ప్రధాని మోదీ మాటలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. చమురు ధరల్లో భారత్‌ను ప్రపంచలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. 


వచ్చే ఎన్నికల్లో తమకు ప్రతిపక్షాల గురించి పోటీ ఉంటుందని..ఐతే ప్రజలంతా తమవైపే ఉన్నారని నెటిజన్లతో మంత్రి కేటీఆర్ అన్నారు. మీ సేవలు, మీ నాయకత్వం జాతీయ స్థాయిలో కావాలని నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ఇచ్చింది ఏమి లేదన్నారు. రాష్ట్రానికి IIM, IISER, NID, IIIT వంటి ఉన్నత విద్యా సంస్థలను ఏ ఒక్కటి కేటాయించలేదని తెలిపారు. 


ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునర్ ప్రారంభించాలని గతంలో లేఖ రాశారు కదా దానిని ఏమైనా స్పందన వచ్చిందా అన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పందన రాలేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్‌కు సంబంధించి భూసేకరణ త్వరలో ప్రారంభం అవుతుందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చారు. 


హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్‌ఎండీఏ, టీఎస్ ఆర్టీసీ దృష్టి పెట్టాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌(HYDERABAD)లో మురుగు నీటి శుద్దీకరణ ప్లాంట్లు రాబోతున్నాయని తెలిపారు. భాగ్యనగరాన్ని మహా నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని..బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. నాగోల్ ఫ్లైఓవర్‌ ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్(KTR). సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా సమస్యలను అధిగమిస్తామని చెప్పారు. 
 


Also read:Russia Bomb Attacks: ఉక్రెయిన్ స్కూలుపై రష్యా బాంబు దాడులు, 60 మంది మృతి


Also read:Pawan Kalyan on alliances in 2024 : పొత్తులపై పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook