Minister KTR: మంత్రి కేటీఆర్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్..క్లారిటీ ఇచ్చిన సదరు సంస్థ..!
Minister KTR: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సదరు సంస్థ వివరణ ఇచ్చింది.
Minister KTR: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఒకరు. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరపున సమాధానాలు చెబుతుంటారు. తాజాగా ఆయన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈసందర్భంగా వాట్సాప్ బ్లాక్ అయినట్లు తెలిపే మెసేజ్ స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు.
తన వాట్సాప్ బ్లాక్ అయ్యిందని..నిన్నటి నుంచి తనకు 8 వేలకుపైగా మెసేజ్‌లు వచ్చాయని తెలిపారు. వచ్చిన వాటిని రిప్లే ఇవ్వాల్సి ఉందన్నారు. తన వాట్సాప్ 24 గంటల నుంచి పనిచేయడం లేదన్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి డిజిటల్ ఛాలెంజెస్ అనే హష్‌ట్యాగ్ చేశారు. మంత్రి కేటీఆర్ వాట్సాప్ బ్లాక్‌పై సదరు సంస్థ స్పందించింది. స్పామ్ కారణంగా వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని వెల్లడించింది. దీనికి లెక్కకు మించి మెసేజ్‌లు రావడమే కారణమని తెలిపింది.
ప్రస్తుతం మంత్రి కేటీఆర్..ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు. ఎడమ కాలి వేలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకున్నట్లు వెల్లడించారు.
Also read:Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..తాజాగా కేసులు ఎన్నంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook