Malla Reedy On Revanth Reddy: మేడ్చల్ జిల్లాలో జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగిన ఘటన రాజకీయ మలుపు తిరుగుతోంది. తనపై జరిగిన దాడిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని చూశారని మల్లారెడ్డి ఆరోపించారు. సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ రెడ్డి దాడి చేయించారని అన్నారు. రెడ్డీల ముసుగులో రేవంత్ రెడ్డి మనుషులు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తనను హత మార్చేందుకు రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది అన్నారు మంత్రి మల్లారెడ్డి. రెడ్డీలు దాడులు చేయరని.. తనపై రెడ్డీలెవరు దాడి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన గుండాలే తనను చంపాలని చూశారంటూ మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
 
బ్లాక్ మెయిల్ చేస్తూ రేవంత్ రెడ్డి తనను టార్చర్ చేశారని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వల్ల తాను చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. బ్లాక్ మెయిల్ భరించడం తన వల్ల కావడం లేదన్నారు. రెడ్డి సింహగర్జన సభకు తానే పర్మిషన్ ఇప్పించానని తెలిపారు.నాయిని నరసింహరెడ్డి చొరవతోనే రెడ్డి కార్పొరేషన్ ముందుకు వచ్చిందని మల్లారెడ్డి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.  తనపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రేవంత్ రెడ్డిపై కేసు పెడతానని, జైలుకు పంపిస్తానని మల్లారెడ్డి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెడ్డీల ముసుగులో రేవంత్ రెడ్డి రాజకీయ పంచాయతీ చేస్తున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. అమెరికాలో ఉండి ఇక్కడ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.రేవంత్ రెడ్డి అక్రమ దందాలు బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. రేవంత్ కు వాల్యూ లేదని.. తనకు తానే ఆయన తోపుగా ఊహించుకుంటున్నారని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కుట్రలన్ని బయటి పెడతానని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రెడ్లకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి. రైతు బంధు, రైతు బీమా పథకాలు రెడ్లకు వస్తున్నాయని చెప్పారు. పార్టీ పదవుల్లోనూ రెడ్లకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు.


READ ALSO: ATTAK ON MALLAREDDY: రెడ్డి సింహ గర్జనలో ఏం జరిగింది? మంత్రి మల్లారెడ్డిపై దాడి చేసిందెవరు?


READ ALSO: Nagababu Tour: ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన..త్వరలో నాగబాబు ఉత్తరాంధ్ర టూర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook