హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఆందోళనల నేపథ్యంలో లాక్ డౌన్ నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర క్రీడా, యువజన శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..  పట్టణంలోని బస్టాండు అవరణలో, రామయ్య బౌళి రైతు బజార్ లో మెట్టుగడ్డ దగ్గర నూతనంగా ఏర్పాటు చేయనున్న రైతు బజార్ ల వద్ద రేపు ఉదయం నుంచే రైతులు కూరగాయల అమ్ముకునేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also :బట్టలు ఉతుకుతూ.. బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. ఫన్నీ వీడియో


కాగా స్థానిక ప్రజలను అభ్యర్థిస్తూ.. దయచేసి చెప్తున్నా ప్రజలు ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకి రావొద్దని, మీకు కావలసిన నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఉదయం 10 గంటల తర్వాత ఎవ్వరు కూడా ఇల్లు వదిలి బయటకు రావద్దని వేడుకున్నారు. ఒకవేళ వస్తే కఠినంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. 


Read also : ధోనీ ఫ్యాన్స్‌‌కి ఆగ్రహం తెప్పించిన BCCI పోస్టర్


ఇదిలాఉండగా మహబూబ్ నగర్ లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లాలోని ట్రేడర్లు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్, వర్తక సంఘం అసోసియేషన్లు, వివిధ సంస్థల ప్రతినిధులతో కరోనా వైరస్ సందర్బంగా ప్రకటించిన లాక్ డాన్ లో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళిక పై సమావేశం నిర్వహించిన మంత్రి, అత్యవసర సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎవరైనా నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేయబడతాయని హెచ్చరించారు. 


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ సంపూర్ణ మద్దతు పలికారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రస్థాయి పోలీసు, వైద్య శాఖల అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సిఎం పరిస్థితిని సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని సిఎం అధికారులను కోరారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..