CM REVANTH REDDY:  జనతా గ్యారేజ్‌ ఇక్కడ అన్ని రిపైర్లు చేయబడును. ప్రభుత్వంలో పరిష్కారం కానీ పనులు.. జనతా గ్యారెజ్‌లో చేసి పెట్టబడును.. కొన్నేళ్ల క్రితం వచ్చిన తెలుగు సినిమాలోని లైన్‌ ఇది.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా జనతా గ్యారేజ్‌ సినిమాలో ఫాలో అవుతున్నట్టే తెలుస్తోంది. ప్రభుత్వంలో పరిష్కారం కొన్ని పనులు.. ఇప్పుడు గాంధీ భవన్‌ వేదికగా పరిష్కారం అవుతున్నాయట. ప్రజాభవన్‌, పలు జిల్లాల్లో అధికారులు పరిష్కరించలేని పనులు జనతా గ్యారేజ్‌.. అదే.. గాంధీభవన్‌లో తీరిపోతున్నాయట.. అందుకే ఇప్పుడు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వారంలో రెండు రోజులు గాంధీభవన్‌కు ప్రజలతో పాటు.. కాంగ్రెస్‌ కార్యకర్తలు క్యూ కడుతున్నారట.. తమ సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వ పెద్దలను నేరుగా కోరుతున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంధీ భవన్‌ అనగానే ధర్నాలు, దీక్షలకే కేరాఫ్‌ అడ్రగా ఉంటుంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే గాంధీ భవన్‌లో జరుగుతాయి.. కానీ టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నాక.. గాంధీభవన్‌ కాస్తా జనతా గ్యారేజ్‌గా మారిపోయిందట. ఎలాగా అంటే ఇటీవల జీవో 317 బాధితులు గాంధీ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే వారి మెరుపు ధర్నాకు మంత్రులు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ వారితో చర్చలు జరిపారు సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. మంత్రుల హామీతో బాధితులు వెనక్కి తగ్గారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని బాధితులు చెప్పారు..


మరోవైపు గ్రూప్‌-4 ఉద్యోగులు గాంధీ భవన్‌ ముట్టడి సమయంలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. గాంధీ భవన్‌లో వారి ధర్నాకు అధికార పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ధర్నాలు చేస్తున్న వారికి మద్దతు ప్రకటించడం.. ఆ తర్వాత సమస్యల కృషికి ప్రయత్నించడం గతంలో ఎన్నడూ చూడలేదని బాధితులే చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రజా భవన్‌లో కూడా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. తాజాగా ప్రజా భవన్‌కు భారీ సంఖ్యలో డీఎస్సీ 2008 అభ్యర్థులు వచ్చారు. 15 ఏళ్లుగా అనుభవిస్తున్న మనోవేదనను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యి 50 రోజులు గడుస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


ఇక గాంధీభవన్‌లో ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మొదట్లో టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్‌దేనట. ఆయన టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించగానే.. గాంధీభవన్‌లో ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వారంలో రెండురోజులు మంత్రులు, నెలకు ఒకసారి ముఖ్యమంత్రి రావాలని ప్రతిపాదించారు. టీపీసీసీ చీఫ్‌ రిక్వెస్ట్‌కు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దాంతో ప్రతి బుధవారం, శుక్రవారం రెండురోజులు మంత్రులు ప్రజావాణికి వచ్చి  ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 27 న ప్రారంభమైన ప్రజావాణిలో ఇప్పటివరకు వేల సంఖ్యలో సమస్యలు పరిష్కరించినట్టు రికార్డులు చెబుతున్నాయి.


మొత్తంగా ప్రజావాణిలో బాధితుల సమస్యలు స్పాట్ లోనే సాల్వ్‌ అవుతున్నాయట. మిగిలిన వాటిని షెడ్యూల్ చేసి పూర్తి చేస్తున్నారు. అటు ఫిర్యాదుల డేటా అంతా గాంధీభవన్ సిబ్బంది డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తంగా గాంధీ భవన్‌లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలు సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుండడంతో గాంధీభవన్ కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నారు..


Also Read:  KT Rama Rao: చర్లపల్లి సెంట్రల్‌ జైలు వద్ద కేటీఆర్‌ హల్‌చల్‌


Also Read: Cm Revanth Reddy: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.