KCR DELHI POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా పూర్తిగా జాతీయ రాజకీయలపైనే ఫోకస్ చేశారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస వ్యతిరేక శక్తులను కూడగట్టేపనిలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తోనూ మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పీకే డైరెక్షన్ లోనే కేసీఆర్ జాతీయ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలతో సమావేశాలు జరుపుతున్న కేసీఆర్.. రెండు, మూడు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందని పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కామెంట్లతో దేశంలో ఏం జరగబోతోంది.. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది. బీజేపీ, కాంగ్రెసేయతర పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు కావచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బరిలో ఉండబోతున్నారనే చర్చ సాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు. అంతకుముందు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రితోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ కూడా ఢిల్లీలో కేసీఆర్ తో మంతనాలు సాగించారు. వీళ్ల మధ్య జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చి జరిగిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చించినట్లు చెబుతున్నారు. గతంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతో కేసీఆర్ చర్చలు జరిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితోనూ కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా గులాబీ బాస్ తో టచ్ లో ఉన్నారనే టాక్ ఉంది.


కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలతో ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ సమయంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు మంత్రి మల్లారెడ్డి. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి దర్శనం తర్వాత మాట్లాడిన మల్లారెడ్డి.. వచ్చే దసరా రోజున సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని చెప్పారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి మొక్కి కేసీఆర్ దేశం కోసం ఢిల్లీ వెళ్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దేశ్‌కీ నేత అని.. ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి వ్యక్తం చేశారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు మంత్రి. బీజేపీ కౌరవుల నుంచి భారతదేశానికి విముక్తి కల్పించాలని.. కేసీఆర్‌ను ప్రధానిని చేయాలని వరంగల్ భద్రకాళిని మొక్కుకున్నారని చెప్పారు మల్లారెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్‌ విసిరారు.


విజయదశమి రోజున కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రకటన తెలంగాణలో సంచలనంగా మారింది. కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల్లో వెళ్తే రాష్ట్రంలోనూ నాయకత్వ మార్పు ఉంటుందనే చర్చ సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు.. తనయుడు కేటీఆర్ కు అప్పగించే  కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అదిమాత్రం జరగడం లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ వైఖరితో ఈసారి ముఖ్యమంత్రి మార్పు ఖాయమనే అభిప్రాయం పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. కేటీఆర్ కు పగ్గాలు ఇవ్వాలని డిసైడ్ అయినందునే.. రాష్ట్ర వ్యవహారాలన్ని అతనికే అప్పగించారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. మొత్తంగా రానున్న రెండు, మూడు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయని తెలుస్తోంది.


READ ALSO: TDP-JANASENA: బీజేపీతో కటీఫ్.. టీడీపీతో డీల్! జనసేన పోటీ చేసి సీట్లు ఖరారు?  


READ ALSO: NTR Centenary Celebrations: ఎన్టీఆర్ కు జూనియర్ నివాళి.. నందమూరి ఫ్యామిలీ ఏకమవుతుందా? మహానాడుకు వెళతారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook