NTR Centenary Celebrations: ఎన్టీఆర్ కు జూనియర్ నివాళి.. నందమూరి ఫ్యామిలీ ఏకమవుతుందా? మహానాడుకు వెళతారా?

NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 08:37 AM IST
  • ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
  • ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్, కళ్యాణ్ రామ్ నివాళి
  • త్వరలో ఒకే వేదికపై నందమూరి ఫ్యామిలీ!
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ కు జూనియర్ నివాళి.. నందమూరి ఫ్యామిలీ ఏకమవుతుందా? మహానాడుకు వెళతారా?

NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా ఏడాది పొడవునా భారీగా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడులో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ శతజయంతోత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఒంగోలులోని మండువవారిపాలెంలో జరగనున్న సభకు తెలుగురాష్ట్రాల నుంచి టీడీపీ నేతలంతా హజరవుతున్నారు. భారీగా జన సమీకరణ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళి అర్పించారు. ఉదయమే ఘాట్ కు వచ్చిన హరికృష్ణ వారసులు.. తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు. టీడీపీ నేతలు, ఆయన అభిమానులు ఘాట్ దగ్గరకు భారీగా చేరుకుని నివాళి అర్పించారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఒకరోజు ముందుగానే అక్కడ వేడుకలు మొదలయ్యాయి. తన అభిమాన నాయకుడి శత జయంతి ఉత్సవాల కోసం నిమ్మకూరు వాసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నందమూరి బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద గ్రామస్తులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాలను, ఆయనతో గడిపిన స్మృతులను నిమ్మకూరు వాసులు నెమరు వేసుకున్నారు. గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఏపీఎన్ఆర్జేసీ జూనియర్ కాలేజీ, స్కూల్ నిర్మించారని చెప్పారు. ఎన్టీఆర్ కృషి వల్లే నిమ్మకూరుతో పాటు పరిసర గ్రామాల్లోని పిల్లలు మంచి విద్యను పొందారని కీర్తించారు.

హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ నిమ్మకూరులో జరగనున్న శత జయంతి వేడుకలకు హాజరవుతున్నారు.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న అభిమానులందరికీ హీరో బాలకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను జరుపుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏడాదిపాటు జరగనున్న శత జయంతి వేడుకల్లో అన్నగారి అభిమానులతోపాటు తమ కుటుంబ సభ్యులంతా పాల్గొంటారన్నారు బాలయ్య.  అన్నగారి శత జయంతి వేడుకలతో నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక వేదికపై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత కాలంగా టీడీపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. మహానాడుకు కూడా హాజరుకావడం లేదు. టీడీపీ విషయంలో ఎక్కడా స్పందించ లేదు. అసెంబ్లీ భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రచ్చగా మారింది. దీనిపై నందూమురి కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. కాని జూనియర్ మాత్రం నేరుగా మీడియాతో మాట్లాడకుండా ఖండిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. దానిపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో మళ్లీ నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకే వేదికపై కనిపించబోతున్నారని తెలుస్తోంది.

READ ALSO:TDP-JANASENA: బీజేపీతో కటీఫ్.. టీడీపీతో డీల్! జనసేన పోటీ చేసి సీట్లు ఖరారు?  

READ ALSO: అప్పులయ్యాయని రాజభవనకు లెటర్.. రూ. 25 వేలు సాయం చేసిన గవర్నర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News