Telangana Mlc Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ప్రొఫెసర్లు ఓడారు. విద్యాసంస్థల యజమానులు గెలిచారు. అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ(Telangana)లో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు ప్రొఫెసర్లు ఓటమి పాలయ్యారు. అదే సమయంలో విద్యా సంస్థల యజమానులు మాత్రం గెలిచారు. ఇండిపెండెంట్లు సత్తా చాటి..గెలిచిన అభ్యర్ధులకు చుక్కలు చూపించారు. నాలుగురోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్ని అధికారపార్టీ దక్కించుకుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్(TRS)అభ్యర్ధి, విద్యా సంస్థల యజమాని సురభి వాణిదేవి(Surabhi vanidevi) దక్కించుకున్నారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ (Prof K nageswar) గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు. ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి పోటీ చేసిన మరో విద్యా సంస్థల యజమాని, టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeswar reddy) గెలిచినా...ఇదే స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న భీకరమైన పోటీ ఇచ్చారు. చివరి వరకూ బరిలో నిలిచి..రెండవ స్థానానికి పరిమితమయ్యారు. ఓ దశలో తీన్మార్ మల్లన్న(Teenmar mallanna) విజయం ఖాయమనే దిశగా కౌంటింగ్ సాగింది. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram) ఓటమి పాలయ్యారు. 


Also read: Teenmaar Mallanna Fan Commits Suicide: తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక యువకుడు సూసైడ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook