Kavitha Letter: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల 10వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనకై బారత్ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా తలపెట్టారు ఎమ్మెల్సీ కవిత. అదే క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ కావడంతో..ఆమె ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కవిత జారీ చేసిన లేఖలో..


దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగులో ఉంది. మహిళలకు రాజకీయ ప్రాతినిద్యం కల్పించే దిశగా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనేది భారత్ జాగృతి సంస్థ డిమాండ్. విపక్షాలతో కలిసి ఈనెల 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష తలపెట్టారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్లాని కవిత డిమాండ్ చేశారు.


మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 9వ తేదీన అంటే ధర్నాకు ఒకరోజు ముందు విచారణకు హాజరుకావల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని..అయితే ముందుగా నిర్ధారించుకున్న ధర్నా కార్యక్రమం ఉండటం వల్ల న్యాయ సలహా తీసుకుంటానని కవిత తెలిపారు.


బీఆర్ఎస్ పార్టీపై, తమ నేత కేసీఆర్‌కు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా భయపడేది లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఉజ్వలమైన దేశ భవిష్యత్ కోసం తమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాల్ని ఎండగడుతుందని చెప్పారు. ఢిల్లీలోని ప్రజా వ్యతిరేక పార్టీ ముందు తెలంగాణ ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడతామన్నారు. 


Also read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు తప్పదా, రేపు ఏం జరగనుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook