హైదరాబాద్ : శుక్రవారం జరిగిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన పోలింగ్‌లో దాదాపు 62% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల పర్యవేక్షణాధికారి తెలిపారు. హింస, అల్లర్లు, ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ శాంతియుతంగా జరిగిందని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, మహాబుబ్‌నగర్ జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలలో నిర్వహించిన రీ పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఆయా జిల్లాల్లోని ఎన్నికల పర్యవేక్షణాధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు, 9 కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. నేడే ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. అదే రోజు జిల్లా కలెక్టర్‌ నియమించిన గెజిటెడ్‌ స్థాయి హోదా కలిగిన అధికారి మేయర్‌, ఛైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశం కోసం నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికైన వార్డు సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ప్రత్యేక సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్లను ఎన్నుకుంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 


కార్పొరేషన్లలో మేయర్‌, మున్సిపాలిటీల్లో ఛైర్‌ పర్సన్ల ఎన్నికను ముందుగా పూర్తి చేయాలి. ఆ తరవాతే డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక కోసం ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఏదైనా కారణంతో 27న ఎన్నికను పూర్తి చేయలేనిపక్షంలో దాని తరవాత రోజు 28న ఎన్నిక నిర్వహిస్తారని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..