మునుగోడు ఉపఎన్నిక ఘట్టం వచ్చేసింది. మరి కాస్సేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. పరువు కోసం ఒకరు, ప్రతిష్ట కోసం మరొకరు, పట్టు కోసం ఇంకొకరు జరిపిన పోరాటంలో..మునుగోడు ఓటు ఎవరికనేది  అంతుచిక్కని ప్రశ్నగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. దాదాపు 200 కోట్ల ఖర్చు జరిగిందనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలది భిన్నమైన పరిస్థితి. ముగ్గురికీ విజయం అవసరమే. మరోసారి గెలిచి పరువు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే..పార్టీ మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిష్ట కోసం పోరాడారు. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ పట్టు కోసం శతవిధాలా కృషి చేసింది. ప్రచార హోరు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన డబ్బు, సభలు, ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలతో మనుగోడు ఓటరును ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఎంతచేసినా సగటు ఓటరు నాడి రాజకీయ పార్టీలకు అర్ధం కాలేదు. 


మునుగోడు ఉపఎన్నిక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రతిష్టతో కూడిన అంశం. ఎందుకంటే కాంగ్రెస పార్టీకు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు ఉపఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకు ఈ ఎన్నికలో గెలుపు గేట్ వే కావచ్చు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇది ప్రతిష్ట. ఓడితే రాజగోపాల్ రెడ్డి జీవితంలో నియోజకవర్గంలో ప్రజలకు ముఖం చూపించలేరు. అటు భారీగా విమర్శలకు లోనవుతారు. ఈ ఎన్నిక గెలుపు బీజేపీ కంటే రాజగోపాల్ రెడ్డికే చాలా చాలా ముఖ్యం.


ఇక కాంగ్రెస్ పార్టీకు పరువు సమస్య. ఎందుకంటే మునుగోడు చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకు కంచుకోట. రాజగోపాల్ రెడ్డి మాత్రం తనను బట్టే పార్టీకు కంచుకోటగా మారిందని చెబుతారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కమార్తె, పాల్వాయి స్రవంతి పోటీలో ఉండటం కాస్త లాభించే అంశమైనా..పార్టీలో లుకలుకలు, అసమ్మతి వర్గాలు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీకు మైనస్.


టీఆర్ఎస్ పార్టీకు ఇది చాలా ప్రతిష్ఠాత్మకం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడంతో టీఆర్ఎస్ పార్టీకు గట్టి షాక్ తగిలింది. అంతకుముందు దుబ్బాక సీటును కూడా బీజేపీకు వదులుకుని పరువు కోల్పోయింది. ఇప్పుడు మునుగోడు స్థానం టీఆర్ఎస్ పార్టీది కాకపోయినా...గెలిచి తీరాల్సిన ఎన్నిక. కేసీఆర్ జాతీయపార్టీ స్థాపించిన తరువాత తొలి ఎన్నిక కావడంతో..గెలవక తప్పని పరిస్థితి. 


మునుగోడు గోడు ఎవరికీ పట్టినా పట్టకపోయినా..ఓటరు నాడి ఎవరివైపన్నది అర్ధం కావడం లేదు. విచ్చలవిడిగా ప్రవహిస్తున్న డబ్బులు ప్రవాహంతో ఒటరు నాడి మారుతుందా లేదా అనేది తెలియడం లేదు. ఈ రాత్రి నోట్ల పంపకాల పరిస్థితి తారాస్థాయికి చేరినట్టు సమాచారం. 


Also read: Munugodu Bypoll: తారాస్థాయికి చేరిన పంపకాలు, అర్ధరాత్రి రహస్యంగా చేతులు మారుతున్న నోట్ల కట్టలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook