Telangana CM Oath: రేపు రేవంత్ కాకుండా మరో ఆరుగురికే ఛాన్స్, , అసెంబ్లీ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం షెడ్యూల్లో మార్పు వచ్చింది. ముందుగా అనుకున్నట్టు 18 మంది ప్రమాణం చేయడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana CM Oath: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మార్పు వచ్చింది. ముందుగా ఊహించినట్టు 18మంది కేబినెట్ ఏర్పడటం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా రేపు ఎల్బీ స్డేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడవ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రిగా తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మద్యాహ్నం ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత 18 మందితో లేదా పూర్థి స్థాయి కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉండాలనుకున్నారు. కానీ కేబినెట్ కూర్పు విషయంలో ఇంకా కసరత్తు పూర్తి కానందున పూర్తి స్థాయి కేబినెట్ కాకుండా కేవలం ఆరుగురే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి కేబినెట్ త్వరలో కొలువుదీరనుంది. రేపు రేవంత్ రెడ్డి కాకుండా మరో ఐదుగురు మాత్రమే ప్రమాణం చేయనున్నారని తెలుస్తోంది. వీరిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పేర్లు విన్పిస్తున్నాయి. ఉత్తమ్ లేకుంటే కోమటిరెడ్డి ఉండవచ్చు. ఇక ఓడిపోయినా సరే పార్టీకి విధేయంగా ఉండటమే కాకుండా ముస్లిం ఓటు కాంగ్రెస్ పార్టీకు బదిలీ అయిన కారణాల దృష్ట్యా షబ్బీర్ అలీ పేరు ఉండవచ్చని సమాచారం.
ఎవరెవరికి ఆహ్వానం
రేపు ఎల్బీ స్డేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ సహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రుల్ని, తెలంగాణ విపక్ష నేతలు, అన్ని పార్టీల అగ్రనేతల్ని ఆహ్వానించారు. మరోవైపు సినీ ప్రముఖులు, ఇతర మేధావులకు ఆహ్వానం పలుకుతున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా రేపటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.
ఎల్బీ స్డేడియంలో రేపు జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్డేడియం పరిసరాల్లో ట్రాపిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షమంది వరకూ హాజరుకావచ్చని అంచనా. అయితే స్డేడియంలో 30 వేలమందికే ఆస్కారం ఉండటంతో స్డేడియం వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
Also read: Rain Alert: ఏపీలో తొలగని వర్షముప్పు, ఆ 5 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook