Car Accident at Gachibowli: గచ్చిబౌలిలో కారు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మృతి
Car Accident at Gachibowli: నగరంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
Car Accident at Gachibowli: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్ సీయూ రోడ్డులో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులోని మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగిందంటే?
గచ్చిబౌలిలోని హెచ్ సీయూ రోడ్డులో తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఆ కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో మృతులు జూనియర్ ఆర్టిస్టులు ఎన్ మానస (23), ఎమ్ మానస (21), కారు డ్రైవర్ అబ్దుల్ రహీమ్ గా పోలీసులు గుర్తించారు.
జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరు అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో ఉంటున్నట్లు తెలిపారు. అబ్దుల్.. మాదాపూర్‌లోని యాక్సిన్ బ్యాంకులో పని చేస్తున్నారు. ఇతడిని విజయవాడ వాసిగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Teacher Suicide: కాలేజీలో కామ క్రీడలు.. రాసలీల వీడియో వైరల్- లేడీ టీచర్ ఆత్మహత్య!
Also Read: 156 Kidney stones: ఆ పేషెంట్ కిడ్నీ నుంచి 156 రాళ్లు తొలగించిన వైద్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook