Woman Harassment: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పాడుపని.. మహిళల బాత్రూం లోకి దూరి ఫోటోలు, వీడియోలు..
Loksabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకీ చెందిన నేత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళలకు తెలియకుండా బాత్రూమ్ లోకి దూరినట్లు కొందరు గమనించారు. వెంటనే సదరు నేతను పట్టుకుని చివాట్లు పెట్టి, చెప్పుదెబ్బలతో దేహాశుద్ది చేశారు. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసింది.
Kompally Congress Leader Misbehaves With Womans: తెలంగాణలో ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎలాగైన లోక్ సభ ఎన్నికలలో గెలిచి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై మరోకరు విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా రాజకీయాల్లో అపోసిషన్ పార్టీలు కానీ లీడర్లు కానీ.. ఏ చిన్న లూప్ హోల్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఎవరైన ఏదైన తప్పులు చేసినట్లు ఆరోపణలు గానీ, ఏవైన ఘటనలు గానీ జరిగితే వాటిని తమ అస్త్రాలుగా మార్చుకుంటారు. ఇక అపోసిషన్ లీడర్లపై ఆరోపణలు చేస్తు ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తారు.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
ప్రజల్లో వీళ్లు ఇలాంటి వారు, ఇలాంటి పార్టీలమూలాలున్నవారు మనకు అవసరమా.. అంటూ విమర్శిస్తుంటారు. అందుకే రాజకీయనేతలు ముఖ్యంగా కొందరు ఎన్నికల సమీపిస్తున్నాయంటే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అంతేకాకుండా ఎక్కడ కూడ తమ తప్పులు బైటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో.. ఒక కాంగ్రెస్ నేత ఏకంగా మహిళల బాత్రూంలోకి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసిన ఘటనలో అడ్డంగా మహిళలకు దొరికిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది.
పూర్తివివరాలు..
కొంపల్లిలో కాంగ్రెస్ నేత చేసిన పని రాజకీయాల్లో రచ్చగా మారింది. స్థానిక కౌన్సిలర్ జ్యోత్స్న శివా రెడ్డి బావ, సుదర్శన్ రెడ్డి మహిళల బాత్రూమ్ లోకి ప్రవేశించడం కొందరు స్థానిక మహిళలు గమనించారు. వెంటనే అతడిని నిలదీశారు. దీంతో సుదర్శన్.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఈక్రమంలో కొందరు మహిళలు ఆగ్రహంతో, కాంగ్రెస్ నేతపై చేయిచేసుకున్నారు. అతని ఫోన్ లో కొన్ని వీడియోలు,ఫోటోలు ఉన్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.
మహిళలు నిలదీస్తున్న కూడా కాంగ్రెస్ నేత మాత్రం.. వారితోనే రివర్స్ లో కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. దీంతో కొందరు మహిళలు చెప్పులతో కొట్టినట్లు సమాచారం. ఒక రాజకీయా పార్టీలో ఉండి, ఇలాంటి పాడుపనులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఛీ.. కొడుతున్నారు. ఇక ఇదే చాన్సుగా భావిస్తున్న కొందరు నాయకులు.. కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఎన్నికల ముందు సంభవించడంతో కొందరు దీన్ని మరింత రాజకీయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సమాజంలో మహిళల పట్ల గౌరవ, మర్యాదలతో ఉండాలని కూడా హితవు పలుకుతున్నారు.
మొత్తానిక ఈ ఘటన మాత్రం కొంపల్లిలో స్థానికంగా వివాదస్పదంగా మారింది. వెంటనే సదరు కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకొవాలని, బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళలంతా కలసి నిలదీస్తున్న కూడా సదరు వ్యక్తి మాత్రం ఏమైన చేసుకుండన్నట్లు ప్రవర్తించాడని బాధిత మహిళలు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తెల్చుకుందామని, పదండని మహిళలకు రివర్స్ అటాక్ దిగినట్లు తెలుస్తోంది. మహిళలు చివాట్లు పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter