E Challan Discount Latest Updates: వాహనాదారులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.  పెండింగ్ చలాన్లపై విధించిన గడువును బుధవారంతో ముగుస్తుండగా.. గడువు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెండింగ్ చలాన్లు ఇంకా చెల్లించనివారు ఈలోగా చెల్లించాలని సూచించింది. ఇప్పటివరకు పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా.. కోటి ఏడు లక్షల మంది తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు. ఇంకా చెల్లించాల్సిన పెండింగ్ చలాన్లు చాలా ఉండడంతో గడువు పొడగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత నెల 26వ తేదీ నుంచి ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పెండింగ్ చలాన్లు చెల్లించాలని అనుకునేవారు https://echallan.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ వెహికల్ నంబరు ఎంటర్ చేసి.. పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి.
 
చలాన్లపై డిస్కౌంట్లు ఇలా..


==> పుష్ కార్ట్‌ల కోసం (39B కేసులు) 10 శాతం చెల్లించాలి.  90 శాతం మినహాయింపు ఉంటుంది.
==> ఆర్‌టీసీ డ్రైవర్లకు 90 శాతం మినహాయింపు ఇవ్వగా.. 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
==> టూ వీలర్, త్రీ వీలర్‌కు 80 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. 20 శాతం చెల్లించాలి.
==> కార్లు, ఇతర వాహనాదారులు 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. 60 శాతం మినహాయించింది తెలంగాణ సర్కారు. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook