BRS Party MLAS Meet Revanth: తెలంగాణలో ఊహించని పరిణామం.. సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ

High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
Big Twist in Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. నేరుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. వారంతా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కావడం విశేషం. వీరి భేటి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. వీరి సమావేశం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎంతో సమావేశమైన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు.
వారిలో గతంలో సునీతా లక్ష్మారెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆమె నేతృత్వంలో వీరంతా కలవడం మరింత ఆసక్తికరంగా మారింది. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించిన మరుసటి రోజే ఈ ఎమ్మెల్యేలు ఇలా సమావేశం కావడం గమనార్హం.
సమావేశం అనంతరం మర్యాదపూర్వకంగా సమావేశమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయమై సీఎంతో సమావేశమైనట్లు తెలిపారు. దావోస్ పర్యటన నుంచి తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. లండన్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. దీంతోపాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను 39 ముక్కలు చేస్తామని ప్రకటించారు. 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు.
ఈ పరిణామాలు జరిగిన మరుసటి రోజే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావడం మరింత కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని గులాబీ పార్టీ నాయకులు ఒత్తిడి తీవ్రం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు ఒక ఝలక్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. ఆ ప్రణాళికలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. మరి వీరి భేటి ఎలాంటి రాజకీయ సంచలనాలకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.
Also Read: Free Power from Feb: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఫిబ్రవరి నుంచే ఉచిత విద్యుత్
Also Read: Sharmila Vs YS Jagan: షర్మిలకు సీఎం జగన్ గట్టి కౌంటర్.. 'మీరంతా నా అక్కాచెల్లెళ్లు' అంటూ వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook