Congress Guarantees: అధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటినా ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంగళవారం ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది.
మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఇతర సభ్యులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా గృహజ్యోతి పథకంపై సమీక్షించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు.. వాటి అమలుపై కమిటీ కొన్ని గంటలపాటు చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వంద రోజుల్లో తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పలు హామీలు నెరవేర్చామని, మిగతా వాటిని గడువులోగా అమలు చేస్తామని చెప్పారు.
తాము ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. వచ్చేనెల (ఫిబ్రవరి) నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు. ఆ కారణంగానే హామీల అమలు జాప్యం అవుతోందని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం సహా గత ప్రభుత్వ పాలనలోని అన్ని అక్రమాలపై విచారణ ఉంటుందని చెప్పారు. నిరుద్యోగ భృతి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల వరకు అన్ని హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీటును కూడా గెలుచుకోదని జ్యోతిష్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు
Also Read Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook