BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..
Telangana Politics: బీఆర్ఎస్ పార్టీ పేరులో కీలక మార్పు ఉండబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొందరలోనే క్లారిటీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
Errabelli Dayakar Comments Over BRS Party Again Revert TO TRS: తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోకి, బీఆర్ఎస్ నేతలు క్యూలు కట్టి మరీ వెళ్లి ఆపార్టీలో చేరిపోతున్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోని కీలకనేతలు కాంగ్రెస్ లోకి చేరుతుండటం కూడా పెనుదుమారంగా మారింది. కడియం శ్రీహరి, కే కేశవరావు లాంటి సీనియర్ లీడర్లు కూడా ఆ పార్టీని వదిలిపోవడం పట్ల బీఆర్ఎస్ కు ఒకింత కొలుకోలేని దెబ్బగా పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా ఎప్పుడు రాజశ్యామల యాగాలు, పూజలు, స్వామిజీలను గౌరవించే గులాబీ బాస్ కు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో తీవ్రచర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఎందరో ఉద్దండులను ఎదుర్కొని రాజకీయాల్లో తనదైన చాణక్యతంతో మాజీ సీఎం పావులు కదిపారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి అనేక మంది కీలక నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వదలిపెట్టి వెళ్లడం, బీఆర్ఎస్ కు మింగుడుపడని అంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రసమితి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా.. హైదరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో, అప్పటి నాయకులందరి మధ్య జనరల్ మీటింగ్ ఏర్పాటు చేసి, ఏకగ్రీవంగా తీర్మానం చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు అప్పటి గులాబీ బాస్ కేసీఆర్ అట్టహసంగా ప్రకటించారు.
దేశ రాజకీయాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రసమితిని, భారత రాష్ట్రసమితిగా మారుస్తున్నట్లు ప్రకటించారు. కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం నేతలు విఫలంఅయ్యారని ప్రచారం మాత్రం తరచుగా విన్పిస్తుంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ అస్తిత్వం కోసం, ఎందరో ఆత్మబలిదానాలు చేసి తెలంగాణ సాధించుకునేందుకు ఎంతో పాటుపడింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో తమదైన గౌరవం సంపాదించుకుంది. అదే విధంగా కేసీఆర్ నిరాహార దీక్షతో ఆత్మ బలిదానం వరకు వెళ్లి, అప్పటి ఢిల్లీ నేతల మెడలు వంచి మరీ తెలంగాణ సాధించుకునేందుకు తమదైన స్టైల్ కార్యచరణ నిర్వహించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తమ ప్రాంతీయ పార్టీ అని ప్రజలు భావించే వరకు వెళ్లింది.
Read More: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..
కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిందో అప్పటి నుంచి ప్రజల్లో ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. పలు సందర్భాలలో సొంత పార్టీ నేతలుకూడా బహిరంగంగానే ఈపార్టీ పేరు మార్పు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇక తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, వరుసగా ఎమ్మెల్యేలు, ఎంపీల వంటి కీలక నేతలు కూడా పార్టీలు మారడంతో బీఆర్ఎస్ మరల ఆత్మవిమర్శలో పడినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మరల బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చేవిధంగా ఆలోచనలు చేస్తున్నామని ఆపార్టీ సీనియస్ నేత ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook