CM Revanth Reddy Again Insulted Bhatti Vikramarka In Iftar: ప్రస్తుతం దేశంలో పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతుంది. ఈక్రమంలో ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ వేడుకలను ఎంతో నిష్టతో జరుపుకుంటారు. ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ లు చేస్తారు. ఉదయం సహార కంటే ముందు, సాయంత్రం ఇఫ్తార్ తర్వాత మాత్రమే అన్నంను ముట్టుకుంటారు. మిగతా సమయంలో కనీసం ఉమ్మిని కూడా అస్సలు మింగరు. అదే విధంగా పవిత్రమైన ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగంను పేద ముస్లింలకు దానంగా ఇస్తారు. ఈ క్రమంలో రంజాన్ మాసమంతా ప్రతిరోజు అనేక చోట్ల ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



తెలంగాణ ప్రభుత్వం కూడా ముస్లింసోదరులందరికి ఘనంగా ఇఫ్తార్ విందును ఎల్బీనగర్ స్టేడియంలో ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు, కార్యకర్తలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ,ముస్లింమతపెద్దలు, స్థానిక నాయకులు, హజరయ్యారు. పెద్ద ఎత్తున ముస్లింయువత కూడా ఈ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ఒకరికి మరోకరు ఫ్రూట్స్ తిపించుకుంటారు. అచ్చం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాగే.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఖర్జూరం పండ్లు తినిపించారు. ఆయన పక్క సీట్లో ఉపముఖ్యమంత్రి భట్టీ కూడా ఉన్నారు. ఇంతలో ఆయన కూడా అసుదుద్దీన్ కు ఖర్జూరం తిన్పించడానికి ప్రయత్నించారు .


కానీ పక్కనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేతితో సైగలు చేస్తు వద్దన్నట్లు వారించారు. ఇక మంత్రి పొంగులేటీ మాత్రం నేరుగా అసదుద్దీన్ వైపుకు వెళ్లి ఫ్రూట్స్ అసదుద్దీన్ కు  తిన్పించారు. ఈ ఘటన కాస్త వైరల్ కావడంతో ఇది సోషల్ మీడియాలో రచ్చగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే భట్టీని టార్గెట్ చేశారని అందుకు పదే పదే అవమానిస్తున్నాడని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.


Read More: Cat Falls In Toxic Tank: ఆ పిల్లిని టచ్ చేస్తే చచ్చిపోతారు.. నగరమంతా హై అలర్ట్.. కారణం ఏంటంటే..?


ఇదిలా ఉండగా.. ఇటీవల భద్రాద్రి పర్యటలో కూడా భట్టీని చిన్న పీట మీద కూర్చుండబెట్టం కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిమీద ఆయనను క్లారిటీ ఇచ్చుకున్న కూడా  సమ్ థింగ్ ఇజ్ ఫిషీ.. అంటూ నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు. ఇఫ్తార్ విందులో ఈ ఘటనతో మరోసారి సీఎం రేవంత్ కావాలనే భట్టీని అవమానంచాడని రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతుంది. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook