Telangana Rain Updates: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. గత జూలైతో పాటు ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజులుగా అక్కడక్కడా చిరు జల్లులు తప్పితే పెద్దగా వర్షాలు కురవలేదు. అదే సమయంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. కానీ వాతావరణంలో మళ్లీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నెల 25 నుంచి 29 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ తాజా అప్‌డేట్ ప్రకారం... ఇవాళ (ఆగస్టు 26) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో (ఆగస్టు 27, 28) రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ నెల 29, 30 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.


అటు ఏపీలోని రాయలసీమకు ఇవాళ భారీ వర్ష సూచన ఉంది. నేటి నుంచి 3 రోజుల పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, యానాం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్త్రాంధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది.
 




Also Read: Horoscope Today August 26th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి బలహీన స్థితిని చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయే ఛాన్స్..


Also Read: Prabhas- Maruthi FIlm Launched: రహస్యంగా ప్రారంభమైన మారుతి-ప్రభాస్ మూవీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook