Prabhas- Maruthi FIlm Launched: రహస్యంగా ప్రారంభమైన మారుతి-ప్రభాస్ మూవీ?

Prabhas and Maruthi film launched: ఎలాంటి సమాచారం లేకుండా మారుతి-ప్రభాస్ సినిమా లాంచ్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 06:10 PM IST
Prabhas- Maruthi FIlm Launched: రహస్యంగా ప్రారంభమైన మారుతి-ప్రభాస్ మూవీ?

Prabhas and Maruthi film formally launched Silently with puja ceremony: బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటి పోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎలాంటి సినిమా చేసినా అది భారీ బడ్జెట్ తోనే భారీ స్టార్ కాస్టింగ్ తో ఒక భారీతనం తోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాలు పెద్ద ఎత్తున లైన్ లో ఉన్నాయి. చివరిగా జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఆయన రాధేశ్యామ్ అనే సినిమా చేశారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. తర్వాత ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నారు.

ఇవి కాకుండా నాగశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలు ప్రకటించారు. అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేసే అవకాశం ఉందంటూ చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా భావించే యువి క్రియేషన్స్ సంస్థతో డైరెక్టర్ మారుతికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆ బ్యానర్లో ఆయన ఇప్పటికే మహానుభావుడు, ప్రతి రోజు పండగే, ఇటీవల పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు చేశారు. ప్రభాస్ కోసం మారుతీ ఒక కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఉలుకు పలుకు లేకుండా చాలా రహస్యంగా గురువారం నాడు ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఎందుకు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ అభిమానులు మారుతితో సినిమా చేయవద్దు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అలాగే మారుతిని టార్గెట్ చేసి దారుణమైన కామెంట్లు చేస్తూ ఉండడంతో వారి దృష్టిలో పడడం ఇప్పుడు మంచిది కాదనే ఉద్దేశంతో ఆ విషయాన్ని పెద్దగా హైలైట్ చేయలేదని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని ప్రభాస్ సొంత సంస్థ అని భావించే యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించడం లేదు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్తికేయ 2 సినిమాకి సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన అభిషేక్ ఆర్ట్స్ కూడా ఈ సినిమాలో భాగం పంచుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఇందులో ఈ నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ రాదు.

Also Read: Sudigali Sudheer Fans: సుడిగాలి సుధీర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి!

Also Read: Sri Reddy Targets Puri Jagannadh: బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News