Heavy Rains in Telangana: భారీ వర్షాలు తెలంగాణ ప్రజలను కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కుండపోత వర్షాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం నీటమునిగిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ కూడా వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది కేసీఆర్ సర్కారు. వరద సహయక చర్యలపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా గత మూడు రోజుల నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రాష్ట్రవ్యాప్తంగా గురువారం 97.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గురువారం వరకు రాష్ట్రంలో సీజన్‌ సగటు 329.3 మిల్లీమీటర్లకు గాను 530 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 


Also Read: Telangana, AP Rains News Live Updates: తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి.. బయటకు రావొద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook