Telangana Rains Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన...
Telangana Rains Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rains Updates: తెలంగాణలో గురువారం (జూలై 21) పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఇవాళ (జూలై 22) ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, మూసాపేట, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల్లో ఇది భారీ వర్షంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ, రేపు (జూలై 22,23) తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 10.45 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని వడ్యాల్, పెంబి ప్రాంతాల్లోనూ 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 8.30 సెం.మీ, వరంగల్ జిల్లా చెన్నరావుపేటలో 6.85 సెం.మీ, సిద్ధిపేట రాఘవపూర్‌లో 6.80 సెం.మీ వర్షపాతం నమోదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook