Telangana Raj Bhavan: తెలంగాణలోని రాజ్ భవన్ కి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వారు ఎవరైనా ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ కార్యాలయవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలోని అత్యున్నత హోదా కలిగిన రాజ్ భవన్ ని సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని రాజకీయాల్లోకి లాగి బురద చల్లేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నుతున్నట్టు రాజ్ భవన్ కార్యాలయ వర్గాలు ఆవేదన వ్యక్తంచేశాయి.      


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని అసాంఘీక శక్తులు లేనిపోని దుష్ర్పచారాలు చేస్తూ రాజ్ భవన్ ప్రతిష్టను, రాష్ట్ర గవర్నర్ గౌరవాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని, అందుకు సోషల్ మీడియాను అస్త్రంగా ఉపయోగించుకుంటుండటం ఆందోళన కలిగిస్తోందని రాజ్ భవన్ కార్యాలయ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. 


ఇలాంటి వారు పనిగట్టుకుని చేసే కుట్రల వల్ల రాజ్యాంగంలోనే అత్యున్నత హోదా కలిగిన గవర్నర్ పదవితో పాటు రాజ్ భవన్ కార్యాలయం విలువలు సైతం మసకబారుతాయని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ట్విటర్ వేదికగా జరుగుతున్న ఈ దుష్ప్రచరాన్ని రాజ్ భవన్ కార్యాలయం తీవ్రంగా ఖండిస్తోందని రాజ్ భవన్ కార్యాలయ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశాయి.


Also Read : TRS MLAs Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు


Also Read :BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై ధర్మపురి సెటైర్లే సెటైర్లు


Also Read : TRS MLAs Deal Issue: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలన్న స్కెచ్ అందుకే: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి