Corona in Telangana: తెలంగాణలోనూ కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,913 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది. మొత్తం 54,534 టెస్టులకుగానూ.. ఈ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6,87,456కు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్​ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల (Corona deaths in Telangana) సంఖ్య 4,036కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.


ఇక గడిచిన 24 గంటల్లో 232 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,75,573 మంది కరోనాను జయించారు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 7,847 యాక్టివ్ కరోనా కేసులు (Corona Acitive cases in Telangana) ఉన్నాయి.


కఠిన నిబంధనలు..


రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్ననేపథ్యంలో ప్రభుత్వం కఠిన (Covid rules in Telangana) నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్ మూడో దశ ప్రారంభమైందని పేర్కొంది.


ఇంటా, బయట మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఆరోగ్య విభాగ డైరెక్టర్​ (డీహెచ్​) శ్రీనివాస రావు సూచించారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని తెలిపారు.


టీకా తీసుకోని వారు వెంటనే ఆ పనిని పూర్తి చేయాలని.. సూచించారు డీహెచ్​


వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది (Holidays canceled for medical staff) ప్రభుత్వం. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.


Also read: Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!


Also read: Palvancha Family Suicide: ఎమ్మెల్యే వనమా ఫస్ట్ రియాక్షన్.. కొడుకుపై ఆరోపణలపై బహిరంగ లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook