Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!

Vanama Raghava Arrest: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో రాఘవను అదుపులోకి  తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 05:36 PM IST
  • హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్
  • పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం హత్య కేసులో రాఘవ అరెస్ట్
  • రాఘవను కొత్తగూడెంకి తరలిస్తున్న పోలీసులు
 Vanama Raghava Arrest: హైదరాబాద్‌లో వనమా రాఘవ అరెస్ట్.. కొత్తగూడెంకు తరలింపు..!

Vanama Raghava Arrest: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను (Vanama Raghava) పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో రాఘవను అదుపులోకి  తీసుకున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ నుంచి కొత్తగూడెం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాఘవ అరెస్టుపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. 

తన కుమారుడిని పోలీసులకు అప్పగిస్తానంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateshwara Rao) బహిరంగ లేఖ విడుదల చేసిన కాసేపటికే వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పోలీసులు రాఘవను ఏ-2 నిందితుడిగా చేర్చారు. ఇదే క్రమంలో ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో తాజాగా బయటకు రావడం సంచలనం రేపింది. ఆస్తి వివాదం పరిష్కారం కోసం వనమా రాఘవను ఆశ్రయించగా.. తన భార్యను పంపిస్తేనే మ్యాటర్ సెటిల్ చేస్తానంటూ అసభ్యంగా మాట్లాడాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు, వనమా వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. 

నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో (Naga Ramakrishna Selfie Video) వెలుగుచూశాక వనమా రాఘవ అరెస్టుకు డిమాండ్లు వెల్లువెత్తాయి. ఘటన జరిగి మూడు రోజులవుతున్నా అతన్ని అరెస్ట్ చేయకపోవడమేంటని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాఘవ అరెస్టుకు (Vanama Raghava) అన్ని వైపులా ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేయక తప్పలేదు. వనమా రాఘవ గతంలోనూ పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఓ గిరిజన మహిళకు చెందిన స్థల వివాదంలో రాఘవ అనుచరులు జోక్యం చేసుకుని భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వెంకటేశ్వర్లు అనే వడ్డీ  వ్యాపారి హత్య కేసులోనూ రాఘవ ఆరోపణలు ఎదుర్కొన్నారు. తండ్రి అధికారాన్ని, పలుకుబడిని అడ్డుపెట్టుకుని రాఘవ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: పాల్వంచ ఘటనపై ఎమ్మెల్యే వనమా ఫస్ట్ రియాక్షన్.. కొడుకుపై ఆరోపణలపై బహిరంగ లేఖ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News