COVID-19 Positive Cases: తెలంగాణలో ఫలితాలు ఇస్తున్న Face Masks, కరోనా కేసులు తగ్గుముఖం
Corona Positive Cases In Telangana | పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా టెస్టులు పెంచడంతో పాటు మరోవైపు కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది.
COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో దేశంలో ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 2,251 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం(ఏప్రిల్ 12న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
తెలంగాణలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 వరకు గత 24 గంటల్లో 79,027 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో రెండు వేల రెండు వందల యాభై ఒకటి మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 29 వేల 5 వందల 29కు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,765కి చేరింది.
Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే
పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఓ వైపు కరోనా టెస్టులు పెంచడంతో పాటు మరోవైపు కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగిన వారికి రూ.1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఆదివారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 565 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణ(Telangana)లో ఇప్పటివరకూ మొత్తం 3,05,900 మంది కరోనా మహమ్మారిని జయించారు.
Also Read: New Coronavirus Symptoms: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే, కనిపిస్తే టెస్టులు తప్పనిసరి
తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే 355 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook