Telangana Sankranti 2023 Holidays: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా తర్వాత రెండో పెద్ద పండుగ 'సంక్రాంతి'. ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2023 సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్. స్కూళ్లకు 5 రోజులు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవులు జనవరి 13న ప్రారంభం అయి 17వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరిగి 18న విద్యాసంస్థలు తెరుచుకుంటాయి. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు 2023 జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్కూళ్ల మాదిరిగా 5 రోజుల సెలవులు కాకూండా.. 3 రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 16వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ సంక్రాంతికి స్కూళ్లకు వారం, కాలేజీలకు కనీసం ఐదు రోజులు సెలవులు ఉంటాయని విద్యార్థులు, ఉద్యోగులు భావించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరూ అసంతృప్తిగా ఉన్నారు. 


2023 జనవరి 14న బోగి, 15న సంక్రాంతి మరియు 16న కనుమ పండుగ ఉన్నాయి. భోగి పండుగ రెండో శనివారం, సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చాయి. దాంతో అదనంగా రెండు సెలవులు కోల్పోయారు. సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన విద్యార్థులు, ఉద్యోగులలో ఉంది. మరో ఐదు రోజుల్లో తెలంగాణాలో 2023 సంక్రాంతి సెలవులు ఆరంభం కానున్నాయి. 


Also Read: AP Group-2 Papers: గ్రూప్ 2 పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు.. ఉత్తర్వులు జారీ!


Also Read: Davidson Bike Milk Viral Video: ఇదేందయ్యో 'ఇది' నేనేడా సూడలే.. పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌! వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.