AP Group-2 Papers: గ్రూప్ 2 పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు.. ఉత్తర్వులు జారీ!

AP Group-2 Mains have Only 2 Papers. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు-2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్‌ టెస్టును 150, మెయిన్‌ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 09:25 AM IST
  • గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పు
  • గ్రూప్ 2 సిలబస్‌లో మార్పు
  • ఉత్తర్వులు జారీ
AP Group-2 Papers: గ్రూప్ 2 పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు.. ఉత్తర్వులు జారీ!

Exam Pattern of APPSC Group-2: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు-2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా.. వాటిని రెండుకు కుదించింది. ఇకపై స్క్రీనింగ్‌ టెస్టును 150, మెయిన్‌ పరీక్షను 300 మార్కులకు నిర్వహించనుంది. ఈ మేరకు శుక్రవారం (జనవరి 6) జీవో 6ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రూపు-2 పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రభు­త్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమో­దిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో గ్రూపు-2 పరీక్ష కోసం మూడు పేపర్లు ఉండేవి. స్క్రీనింగ్‌ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌ పేపర్‌ 1లో జనరల్‌ స్టడీస్‌ ఉండేది. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఇందులో మార్పులు జరిగాయి. మెయిన్స్‌లో పేపర్‌ 1గా ఉన్న జనరల్‌ స్టడీస్‌ను రద్దు చేసి.. దాన్ని స్క్రీనింగ్‌ టెస్టుకు మార్చారు. గతంలో మాదిరిగానే 150 మార్కులకు దీన్ని  నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు కుదించారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. 

150 మార్కుల పేపర్ 1 ప్రశ్నాపత్రంలో ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారత రాజ్యాగంకు సంబందించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో ప్రశ్నాపత్రంలో భారత్, ఏపీ ఎకానమి.. సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఉంటాయి. గ్రూపు-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం తెలిపింది.

సిలబస్‌లో మార్పు:
స్క్రీనింగ్‌ టెస్టు: జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ - 150 మార్కులు
మెయిన్స్‌ పేపర్ 1 : ఏపీ చరిత్ర, భారత రాజ్యాంగం - 150 మార్కులు
మెయిన్స్‌ పేపర్ 2 : ఏపీ, భారత ఆర్థిక పరిస్థితి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 150 మార్కులు

Also Read: Davidson Bike Milk Viral Video: ఇదేందయ్యో 'ఇది' నేనేడా సూడలే.. పాల డెలివరీకి హార్లే డేవిడ్‌సన్‌ బైక్‌! వైరల్ వీడియో

Also Read: Saturn Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని.. ఈ 3 రాశుల వారికి ఇక డబిడదిబిడే!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News