Telangana Holidays: తెలంగాణలో పాఠశాలల సెలవులు పొడిగింపు ? కరోనా సంక్రమణ భయం ?
Telangana Holidays: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
Telangana Holidays: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు తెర్చుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు జూన్ 13 నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజులో 155 కరోనా కేసులు నమోదు కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసులు ఇంకా పెరిగే ప్రమాదముందని సాక్షాత్తూ వైద్యశాఖే నివేదికిచ్చింది. ఈ తరుణంలో విద్యాసంస్థలు తెర్చుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
పిల్లల ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల సెలవుల్ని పొడిగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు తెరిస్తే కరోనా సంక్రమణ వేగం పుంజుకోనుందని సమాచారం. అందుకే పాఠశాలల ప్రారంభంపై రేపు అంటే ఆదివారం సాయంత్రానికి ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Also read: Khaitalapur Bridge: కూకట్‌పల్లి-హైటెక్ సిటీ మధ్య ఇకపై నో ట్రాఫిక్ జాం..అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి