Telangana liquor sales: తెలంగాణ రాష్ట్రం లిక్కర్​ సేల్స్ విషయంలో మరో రికార్డు సృష్టించింది. డిసెంబర్​ 1 నుంచి డిసెంబర్ 31 (బిల్లింగ్ ముగిసే సమయానికి) మధ్య రాష్ట్రంలో రూ.3,350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ (liquor sales record in Telangana) ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాదాపు 40 లక్షల కేసుల లిక్కర్​ విక్రయాలు ఈ నెలలో జరిగినట్లు వెల్లడించింది అబ్కారీ విభాగం. రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారని తెలిపింది. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయి మద్యం అమ్మకాలు జరగటం ఇదే ప్రథమమని వివరించింది.


న్యూ ఇయర్ సంబరాల్లో యువత..


సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే.. చాలా మంది యువత సంబరాలు (New year celebrations) చేసుకోవడం సర్వ సాధారణం. అయితే పార్టీ అంటే అందులో లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో నేడు భారీగా లిక్కర్ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు నేడు అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. దీనితో విక్రయాలు మరింత పెరగొచ్చని తెలుస్తోంది.


మరోవైపు బార్లు, పబ్బుల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం సరఫరా చేసుకునే వీలు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.


వేడుకలపై ఆంక్షలు కూడా..


ఓ వైపు 12 గంటల వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించగా.. కొవిడ్ భయాల నేపథ్యంలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. హైదారాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic restrictions in Hyderabad) విధించారు.


న్యూ ఇయర్ పార్టీలపై ఆంక్షలు ఇలా..


ఇక న్యూ ఇయర్​ వేడుకల్లో మాస్క్ ధరించకుండా కనిపించిన వారికి రూ.1,000 జరిమానా విధించనున్నారు పోలీసులు. రెండు డోసుల టీకా తీసుకున్న వారిని మాత్రమే వేడుకలకు అనుమతించనున్నట్లు ఇది వరకే స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి తీసుకున్న వారికి మాత్రమే పార్టీల నిర్వహణకు అనుమతినిస్తామని కూడా తేల్చి చెప్పారు.


బహిరంగ ప్రదేశాల్లో  డీజేలు పెట్టేందుకు అనుమతి లేదని తెలిపింది పోలీస్ విభాగం. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించనున్నట్లు కూడా హెచ్చరించింది. వీటితో పాటు అసభ్యకర దుస్తులు ధరించినా, ధ్వని కాలుష్యానికి కారణమైనా.. కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. భౌతిక దూరం పాటిస్తూ.. అన్ని రకాల జాగ్రత్తలతో న్యూ ఇయర్ వేడుకల జరుపుకోవాలని సూచించింది.


Also read: TS RTC Offer: ఆర్​టీసీ న్యూ ఇయర్​ ఆఫర్​- జనవరి 1న వారికి ఉచిత ప్రయాణ సదుపాయం!


Also read: Revanth Reddy : మరోసారి రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. జూబ్లీహిల్స్‌లోని నివాసం వద్ద టెన్షన్.. టెన్షన్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook