TS RTC Offer: ఆర్​టీసీ న్యూ ఇయర్​ ఆఫర్​- జనవరి 1న వారికి ఉచిత ప్రయాణ సదుపాయం!

TS RTC Offer: జనవరి 1న 12 ఏళ్ల లోపు పిల్లలకు, వారితో ప్రయాణించే తల్లిదండ్రులకు ఆర్​టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది తెలంగాణ ఆర్​టీసీ.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 11:48 PM IST
  • న్యూ ఇయర్​ స్పెషల్ ఆఫర్స్ ప్రకటించిన టీఎస్​ ఆర్​టీసీ
  • జనవరి 1న 12 ఏళ్ల లోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచిత ప్రయాణ సదుపాయం
  • డిసెంబర్​ 31 అర్ధ రాత్రి నుంచి హైదరాబాద్​లో ప్రత్యేక బస్సులు
TS RTC Offer: ఆర్​టీసీ న్యూ ఇయర్​ ఆఫర్​- జనవరి 1న వారికి ఉచిత ప్రయాణ సదుపాయం!

TS RTC Offer: న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్​టీసీ. కొత్త సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న 12 ఏళ్లలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఆర్​టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం (TS RTC Free ride Offer) చేసే అవకాశం కల్పించింది. ప్రయాణికులను ఆకర్షించే ఉద్దేశంతో సరికొత్త విధంగా ఆఫర్​ను ప్రకటించింది ఆర్​టీసీ. ఈ ఆఫర్​పై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆర్​టీసీ ఎండీ సజ్జనార్ (TS RTC MD Sajjanar on New year offer) సూచించారు.

ఆర్​టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న రీతిలో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆఫర్లే కాకుండా.. ఆర్​టీసీ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పలు మార్లు సామాన్య ప్రయాణికుడిలా బస్సుల్లో ప్రయాణించారు. ఈ సమయంలో ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలపై చర్చించారు.

మందుబాబులకూ గుడ్ న్యూస్​!

కొత్త సంవత్సరం నేపథ్యంలో మందుబాబులకు కూడా గుడ్​ న్యూస్ (New Year 2022) చెప్పింది ఆర్​టీసీ. డిసెంబర్ 31 అర్ధ రాత్రి 12:30 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు.. హైదరాబాద్​లోని పలు రూట్లలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు (RTC Special busses on new Year) తెలిపింది. న్యూ ఇయర్​ వేడుకల్లో పాల్గొనడం, మద్యం సేవించి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు దూరంతో సంబంధం లేకుండా.. రూ.100 ఛార్జీ వసూలు చేయనున్నట్లు వెల్లడించింది ఆర్​టీసీ.

Also read: Telangana Rythu Bandhu: మూడో రోజుకు రైతు బంధు- రూ.1,302 కోట్ల చెల్లింపులు పూర్తి!

Also read: Rajendrangar Rape Incident: రాజేంద్రనగర్‌లో పదో తరగతి బాలికపై యువకుడి రేప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News