Telangana SI Jobs: తెలంగాణ ఎస్ఐ ఉద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 8 మార్కులు కలపనున్నట్లు వెల్లడించింది. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్నంలో 8 తప్పులు దొర్లినట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ అధికారులు గుర్తించారు. ఇంగ్లీష్-తెలుగు ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ 'ఏ'లో ఇచ్చిన 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులను గుర్తించారు. తమవైపు నుంచి జరిగిన తప్పు కావడంతో అభ్యర్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మార్కులు కలపాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఎస్ఎల్‌పీఆర్‌బీ నిర్ణయం ఎస్ఐ ఉద్యోగ అభ్యర్థులకు కలిసిరానుంది. సాధారణంగా 200 మార్కులకు గాను 60 మార్కులు సాధిస్తే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినట్లు. టీఎస్ఎల్‌పీఆర్‌బీ తాజా నిర్ణయంతో అభ్యర్థులు 52 మార్కులు సాధించినా క్వాలిఫై అయినట్లే. ఇక ఇదే ప్రిలిమినరీ పరీక్షలో బుక్‌లెట్ 'ఏ'లో ఆరు ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా గుర్తించారు. ఇందులో 113,183,186,192,197వ నంబర్ ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలు ఉండటంతో.. రెండింటిలో ఏ ఆప్షన్‌కి బబ్లింగ్ చేసినా మార్కులు ఇవ్వనున్నారు. సరైన సమాధానాలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్న ప్రశ్నలకు కూడా మార్కులు కలపాలని అభ్యర్థులు కోరుతున్నారు. కన్ఫ్యూజన్‌లో అభ్యర్థులు ఆ ప్రశ్నలు వదిలేస్తే నెగటివ్ మార్కులతో నష్టపోతారని అంటున్నారు.


కాగా, ఈ నెల 7న తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 554 ఎస్ఐ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన కీ కూడా విడుదలైంది. 'కీ'లో పలు ప్రశ్నలకు తప్పులు దొర్లినట్లు తేలడంతో అభ్యర్థులకు మార్కులు కలపాలని తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: IND vs PAK: సాధారణ మ్యాచ్‌లాగే భారత్‌తో తలపడతాం.. ఫలితం మా చేతుల్లో లేదు: బాబర్‌ ఆజామ్‌


Also Read: Telangana Survey: రోజురోజుకు తగ్గుతున్న కేసీఆర్ గ్రాఫ్.. కారుకు బ్రేకులేనా? తాజా సర్వేలో సంచలనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook