ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని వనపర్తి జిల్లాలోని 6,715 మంది విద్యార్థులు జయజయహే తెలంగాణ గీతాన్ని ఒకేసారి ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. దాదాపు 25 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలతో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2012లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2000 మంది విద్యార్థులు ఈ గీతాన్ని పాడగా..  ఇప్పుడు దాదాపు ఆరు వేల మందితో గానం చేసి రికార్డును కైవసం చేసుకోవడం నిజంగానే సంతోషదాయకమైన విషయం అన్నారు. రికార్డు సర్టిఫికెట్‌ను జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి, సంస్థ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డికి వండర్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు అందించారు.