Telangana 10th Class Results 2020 | హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా వైరస్(CoronaVirus) వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులను పాస్(TS SSC 2020 Results) చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారు చేసినట్లు మంత్రి సబిత తెలిపారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి http://www.manabadi.co.in/
మనబడి వెబ్‌సైట్


రాష్ట్రంలోని మొత్తం 5,34,903 మంది 10వ తరగతి విద్యార్థుల(TS 10th Results 2020)ను పాస్ చేసినట్లు స్పష్టం చేశారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ మెమోలు పాఠశాలల్లో తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫలితాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా SSC బోర్డుకు ఫిర్యాదులు పంపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ