TS SSC Results 2024 Live: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
TS 10th Results 2024 Live Updates: తెలంగాణ పదో తరగతి ఫలితాలు మరి కాస్సేపట్లో వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు వెలువడనున్న ఫలితాలను https://results.bse.telangana/gov.in, https://results/bsetela, https://results.cgg.gov.in లింక్‌లు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
TS 10th Results 2024 Live Updates: తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఎగువన ఇచ్చిన లింక్స్‌లో ఏదో ఒక లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు..మీ ఫలితాలు మార్కులతో పాటు స్క్రీన్‌పై ప్రత్యక్షమౌతాయి. మరి కాస్సేపట్లో అంటే ఇవాళ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేయనున్నారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగాయి. దాదాపు 5 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 2,57,952 మంది కాగా బాలికల సంఖ్య 2,50433 మంది ఉన్నారు. ఏప్రిల్ 13 వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ వంటి ప్రక్రియ పూర్తి చేసకుని ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారు. ఇవాళ ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook