TS SSC Results 2022: తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడు (జూన్ 30) వెల్లడికానున్నాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వెబ్‌సైట్స్‌లో టెన్త్ ఫలితాలు :


result.cgg.gov.in 
tsbie.telangana.gov.in
manabadi.co.in


ఇలా చెక్ చేసుకోండి :


పైన సూచించిన మూడు వెబ్‌సైట్లలో ఏదేని వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
హోంపేజీలో ఎస్ఎస్‌సీ ఫలితాలు ఆప్షన్‌పై క్లిక్ చేయండి
మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కండి
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు కనిపిస్తాయి
భవిష్యత్ అవసరాల కోసం ఆ ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.


పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీని కూడా నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడి రోజే మంత్రి సబితా ఇంద్రారెడ్డి సప్లిమెంటరీ పరీక్షా తేదీలను కూడా ప్రకటించారు. ఇవాళ కూడా ఫలితాల వెల్లడి సందర్భంగా సప్లిమెంటరీ తేదీలు ప్రకటించవచ్చు.


కాగా, తెలంగాణలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. కరోనా కారణంగా ఈసారి 11 పేపర్లను 6 పేపర్లకే కుదించారు. సిలబస్‌ను 30 శాతం తగ్గించడంతో పాటు ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ఎక్కువగా ఇచ్చారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత నిర్వహించిన పరీక్షలు కావడంతో ఫలితాలపై విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.