Manabadi TS SSC Result 2022 : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ (జూన్ 30) ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈసారి  5,03,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,53,201 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,23,779 బాలురు, 2,29,422 మంది బాలికలు ఉన్నారు.  87 శాతం మంది బాలురు, 92.45 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా 97 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచింది. హైదరాబాద్ 79 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 3007 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదవగా 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. ప్రైవేట్‌గా మొత్తం 819 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 448 మంది బాలురు, 371 మంది బాలికలు ఉండగా.. 51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. ఓటమే గెలుపుకు తొలి మెట్టుగా భావించి ముందుకు సాగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు.


విద్యార్థులు ఈ వెబ్‌సైట్స్‌లో టెన్త్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు:


result.cgg.gov.in 
tsbie.telangana.gov.in
manabadi.co.in


ఈసారి ఆరు పేపర్లే :


తెలంగాణలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా ఈసారి 11 పేపర్లను 6 పేపర్లకే కుదించారు. సిలబస్‌ను 30 శాతం తగ్గించి కేవలం 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్‌ను పెంచారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత నిర్వహించిన పరీక్షలు కావడంతో ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూశారు.
 


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత తగ్గిందంటే..


Also Read: Jr Ntr Phone Call: కోమాలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ ఫోన్.. మాటవినగానే వేళ్లు కదిలాయట!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.