Telangana కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
TS Entrance Exam Schedule Released: రాష్ట్రంలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.
TS Entrance Exam Schedule Released: తెలంగాణలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ఇంజనీరింగ్, ఫార్మాలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేశారు.
ఈసెట్ పరీక్షను జూలై 1న, పీజీఈసెట్ ఎంట్రన్స్ పరీక్ష జూన్ 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కొన్ని ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ సిద్ధం చేసింది. అయితే టీఎస్ ఐసెట్, టీఎస్ ఎడ్‌సెట్, టీఎస్ పీఈసెట్, పీజీలాసెట్ లాంటి మరికొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్‌ల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్నట్లు చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తెలిపారు.
Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
టీఎస్ ఎంసెట్, టీఎస్ ఈసెట్‌ను జేఎన్‌టీయూ నిర్వహించనుంది. మరోవైపు పీజీ ఈసెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించడానికి నిర్ణయించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. డిగ్రీ పరీక్షలు పూర్తయితేనే, లేదా వాటిపై స్పష్టత వస్తేనే మిగతా ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు కానున్నాయి.
Also Read: JEE Main 2021 Admit Card: జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook